Mumbai Death Suicide : ముంబైలో 24 ఏళ్ల డెంటల్ డాక్టర్ (MDS) విద్యార్థిని స్తుతి సోనవానే తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు తన ప్రియుడు ఫజల్ మహ్మద్ ఖాన్ (31) కారణమని ఆరోపిస్తూ ఆమె ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసింది. అతను తనను మానసికంగా వేధించాడని, అందరి ముందు అవమానించాడని ఆమె ఆ నోట్‌లో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడైన ఫజల్‌ను అరెస్ట్ చేశారు.
స్తుతి, ఫజల్ ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమై, గత ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నారు. అయితే కాలక్రమేణా తమ బంధం ముందుకు సాగదని భావించి, విడిపోయి కేవలం స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ, విడిపోయిన తర్వాత స్తుతి జీవితంలోకి మరో వ్యక్తి రావడాన్ని ఫజల్ తట్టుకోలేకపోయాడు. ఆమెపై కోపంతో అసభ్య పదజాలంతో దూషిస్తూ, తీవ్రంగా అవమానించడం మొదలుపెట్టాడు. ఇది ఆమెను మానసిక కుంగుబాటులోకి నెట్టింది.
Stuti Sonwane (24), a dentistry student, took her own life after writing six pages of notes
In those notes, she mentioned how Fuzail Mohammad Khan harassed her and made remarks like you will end up like Shraddha Walker
Stuti was found hanging from the ceiling
Every day there… pic.twitter.com/bnNY5KIv8n
— Tushar ॐ♫₹ (@Tushar_KN) March 10, 2026
స్తుతి తన సూసైడ్ నోట్‌లో ఒక విస్తుపోయే విషయాన్ని ప్రస్తావించింది. ఫజల్‌తో ఆమె పడుతున్న ఇబ్బందుల గురించి తన స్నేహితులకు తెలుసని, వారు సరదాగా “నిన్ను మేం ఫ్రిజ్‌లో చూడాలనుకోవడం లేదు” అని జోక్ చేసేవారని రాసింది.
కానీ ఆ మాటలు కూడా ఆమెను మరింత కలచివేసి ఉండవచ్చు. సోమవారం ఉదయం ఎంతకీ గదిలో నుంచి బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు తలుపులు పగులగొట్టి చూడగా ఆమె విగతజీవిగా కనిపించింది. పోలీసులు నిందితుడిపై ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు (సెక్షన్ 108) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
