youtube: యూట్యూబ్‌లో వన్ మిలియన్ వ్యూస్ వస్తే ఎన్ని లక్షలొస్తాయి?

youtube

youtube: యూట్యూబ్ అనేది కంటెంట్ క్రియేటర్లకు ఒక అక్షయ పాత్రలాంటిది. వీడియోలకు ఎన్ని ఎక్కువ వ్యూస్ వస్తే, క్రియేటర్లు అంతగా డబ్బు సంపాదించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా లక్షలాది మంది క్రియేటర్లు భారీ స్థాయిలో ఆదాయాన్ని గడిస్తున్నారు. మీ వీడియోను లక్షలాది మంది వీక్షించినట్లయితే, అది వేల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. మరి మీ వీడియోకు ఒక మిలియన్ వ్యూస్ వస్తే అసలు ఎంత డబ్బు సంపాదించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

సొంతంగా యూట్యూబ్ ఛానెల్

మీ వీడియో ఒక మిలియన్ వ్యూస్ సాధిస్తే, మీరు సులభంగా లక్ష రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది. అయితే యూట్యూబ్ ఇచ్చే ఈ ఆదాయం అనేది వీడియో రకం, అది ఏ కేటగిరీకి చెందింది. ఆ వీడియోను ఏ దేశాల ప్రేక్షకులు చూస్తున్నారు అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ ఏడాది లెక్కల ప్రకారం, క్రియేటర్లకు ప్రతి 1,000 వ్యూస్‌కు 50 నుండి 200 రూపాయల వరకు ఆదాయం వస్తోంది. దీని ప్రకారం చూస్తే, 10,000 వ్యూస్‌కు 500 నుండి 2,000 రూపాయలు, అలాగే ఒక లక్ష వ్యూస్‌కు 5,000 నుండి 20,000 రూపాయల వరకు లభిస్తుంది. మీరు కూడా సొంతంగా యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టి కంటెంట్ క్రియేట్ చేయడం ప్రారంభిస్తే లక్షల్లో సంపాదించవచ్చు.

కానీ యూట్యూబ్‌లో డబ్బు సంపాదించాలంటే మీరు కచ్చితంగా యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ (YPP)లో సభ్యులై ఉండాలని గుర్తుంచుకోవాలి. మీరు ఈ ప్రోగ్రామ్‌లో భాగం కాకపోతే మీకు ఆదాయం రాదు. ఈ ప్రోగ్రామ్‌లో చేరడానికి మీకు కనీసం 1,000 మంది సబ్‌స్క్రైబర్లు ఉండాలి, దాంతో పాటు 4,000 గంటల వాచ్ టైమ్ పూర్తి చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే మీ ఛానెల్ మానిటైజేషన్‌కు అర్హత సాధిస్తుంది.

ఇక మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించడం చాలా ముఖ్యం. యూట్యూబ్‌లో వీడియోల సంఖ్య కంటే వాటి నాణ్యతపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉన్న విషయాలపై వీడియోలు చేయడానికి ప్రయత్నించండి. మీ వీడియో వీలైనంత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా మీ వీడియోలను అమెరికా, బ్రిటన్ వంటి విదేశీ దేశాల్లో చూస్తే, మీ ఆదాయం ఇంకా గణనీయంగా పెరుగుతుంది.