BIG BREAKING : తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుదుపు చోటుచేసుకోబోతుందా? కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకమైన, సీనియర్ నేతగా ఉన్న జీవన్ రెడ్డి హస్తం పార్టీకి హ్యాండ్ ఇవ్వబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న తాజా వార్తలు. గత కొంతకాలంగా పార్టీ పరిణామాలపై అసంతృప్తిగా ఉన్న ఆయన, ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది.
బిగ్ బ్రేకింగ్
కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్ బై యోచన..?
ఉగాది పండుగ లోపే కొత్త నిర్ణయం.. బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి
ఈనెల మార్చి 20 లోపే రాజీనామా ప్రకటన చేయనున్నట్టు సమాచారం
ఇప్పటికే కార్యకర్తలతో మాట్లాడుతున్న జీవన్ రెడ్డి
జీవన్ రెడ్డి అభిమానులు, అనుచరుల గ్రూప్ డీపీలు… pic.twitter.com/1H44nAIDaw
— Telugu Feed (@Telugufeedsite) March 14, 2026
చాలా కాలంగా పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని జీవన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు పార్టీలో మరియు ప్రభుత్వంలో ప్రాధాన్యత పెరగడం, తనను కాదని ఇతర నేతలకు విలువ ఇవ్వడంపై ఆయన తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పార్టీలో ఉండటం కంటే బయటకు రావడమే మేలని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ , కేటీఆర్‌తో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఆయన త్వరలోనే ‘కారు’ ఎక్కబోతున్నారని, గులాబీ గూటికి చేరడం దాదాపు ఖాయమైందని పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. తన రాజకీయ భవిష్యత్తుపై ఇప్పటికే తన అనుచరులు, సన్నిహితులతో జీవన్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. వారి అభిప్రాయం తీసుకున్న తర్వాతే 25వ తేదీన తన రాజీనామాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఒకవేళ జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీని వీడితే, అది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగానే భావించవచ్చు. మరి ఈ ప్రచారంపై జీవన్ రెడ్డి స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.
