Harish Rao : ఎవడో ఎందుకు నువ్వే రా పోటీకి..సీఎంకు హరీష్ సవాల్!

Harish rao

Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం ముదిరింది.ఇటీవల సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అత్యంత ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని పగటి కలలు కంటున్నారని, ఆయన తలకిందులుగా తపస్సు చేసినా అది సాధ్యం కాదని ఎద్దేవా చేశారు. ప్రస్తుత పాలన పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతుందని ఆయన జోస్యం చెప్పారు.

ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇస్తూ.. “సిద్దిపేటలో ఎవరో ఎందుకు పోటీ చేయడం, సాక్షాత్తు రేవంత్ రెడ్డినే వచ్చి ఇక్కడ పోటీ చేయాలి” అని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డిని తాను స్వయంగా ఆహ్వానిస్తున్నానని, దమ్ముంటే సిద్దిపేట గడ్డపై తనపై పోటీ చేసి తనపై గెలవాలని హరీష్ రావు సవాల్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, కేవలం రాజకీయ విమర్శలతో పబ్బం గడుపుకుంటున్నారని ముఖ్యమంత్రిపై ఆయన మండిపడ్డారు.