Osmania Biscuits : హైదరాబాద్ లో ఉస్మానియా బిస్కెట్ అంటే తెలియని వారుండరు. అయితే, మనం ఎంతో ఇష్టంగా తినే ఈ బిస్కెట్ల వెనుక ఉన్న అసలు భయంకరమైన నిజాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అంబర్‌పేటలోని కమలానగర్లో అక్రమంగా నిర్వహిస్తున్న ఒక బిస్కెట్ తయారీ కేంద్రంపై పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా మెరుపు దాడి చేశారు. ఈ తనిఖీల్లో బయటపడిన దృశ్యాలు చూస్తే సామాన్యులకు మతిపోవడం ఖాయం.
Osmania biscuit may never feel the same again, after watching this 👇
A joint raid by police and Food Safety officials at Kamalanagar, Amberpet exposed an illegal biscuit manufacturing unit.
• Hazardous chemicals allegedly used in preparation
• Chemicals reportedly added for… pic.twitter.com/56kEgHUXw0— Telugu360 (@Telugu360) March 27, 2026
ఆ తయారీ కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో బిస్కెట్లను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బిస్కెట్లు మంచి రంగు , ఆకర్షణీయంగా కనిపించడం కోసం అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను వాడుతున్నట్లు తేలింది. వీటన్నింటికంటే దారుణం ఏమిటంటే, బిస్కెట్ల తయారీలో పాడైపోయిన, కుళ్ళిన కోడిగుడ్లను విచ్చలవిడిగా వాడుతున్నట్లు అధికారులు గుర్తించి షాక్‌కు గురయ్యారు.
"Fake Osmania Biscuits" తయారీ కేంద్రంపై దాడి చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
హైదరాబాద్ – అంబర్పేట్ పరిధిలోని కమలానగర్ ప్రాంతంలో "మేరజ్ బేకరి" పేరుతో కల్తీ ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్న తయారీ కేంద్రంపై దాడి చేసిన పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు
బిస్కెట్లు మంచి రంగులోకి… pic.twitter.com/HNHugBLMsP
— Mirror TV (@MirrorTvTelugu) March 28, 2026
కనీస అనుమతులు లేకుండా, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ యూనిట్ యజమాని మిరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న నిల్వలను సీజ్ చేసి, నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. ఇలాంటి అపరిశుభ్ర కేంద్రాల్లో తయారయ్యే బిస్కెట్లు తినడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇకపై మీరు బిస్కెట్లు కొనేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
