New Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

New Rules

New Rules: ఏప్రిల్ 1 నుండి మన దేశంలో భారీ మార్పులు రాబోతున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) మొదలవుతున్న వేళ.. పన్నులు, జీతాలు, రైల్వే రూల్స్ ఇలా అన్నింటిలోనూ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. సామాన్యుడి జేబుపై ప్రభావం చూపించే ఆ ముఖ్యమైన మార్పులేంటో ఒకసారి చూద్దాం:

కొత్త ఆదాయపు పన్ను చట్టం – 2025 (New Income Tax Act)

  • 60 ఏళ్లుగా ఉన్న పాత పన్ను చట్టానికి కాలం చెల్లింది. ఇకపై ‘ఆదాయపు పన్ను చట్టం, 2025’ అమల్లోకి రానుంది. పన్ను నియమాల్లో ఉన్న కష్టమైన పదాలను తొలగించి, సామాన్యులకు అర్థమయ్యేలా మార్చారు.
  • టాక్స్ ఇయర్ (Tax Year): ఇకపై అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ వంటి కన్ఫ్యూజన్ ఉండదు. అన్నింటికీ కలిపి కేవలం టాక్స్ ఇయర్ అనే ఒకే పదాన్ని వాడుతారు. పాన్ (PAN) కార్డు, ఐటీ రిటర్న్స్‌ విషయంలో రూల్స్ మరింత స్ట్రిక్ట్‌గా ఉండబోతున్నాయి.

జీతాల మార్పు :
కొత్త కార్మిక చట్టాల వల్ల ఉద్యోగుల జీతాల లెక్కలు మారనున్నాయి. బేసిక్ పే పెరగడం వల్ల మీ చేతికి వచ్చే జీతం కొంచెం తగ్గే అవకాశం ఉంది. మీ పీఎఫ్ (PF), గ్రాట్యుటీ అమౌంట్ పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో మీకు మంచి లాభాన్ని ఇస్తుంది.

రైల్వే టికెట్ క్యాన్సిలేషన్

రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలి. రైల్వే శాఖ తన క్యాన్సిలేషన్ పాలసీని మార్చింది. : రైలు బయలుదేరడానికి 8 గంటల ముందు మాత్రమే టికెట్ క్యాన్సిల్ చేసుకునే వీలుంటుంది. అంతకంటే తక్కువ టైమ్ ఉంటే ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు. (ఇంతకుముందు ఇది 4 గంటలుగా ఉండేది).

విమాన ధరలు పెంపు

CNG, PNG తో పాటు విమాన ఇంధనం (ATF) ధరలను కూడా ఏప్రిల్ 1న సవరించనున్నారు. దీనివల్ల విమాన టికెట్ల ధరలు మరియు రవాణా ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది.

  • ATM చార్జీల మోత
    HDFC Bank ఇకపై UPI ద్వారా చేసే ATM విత్‌డ్రాయల్స్ కూడా నెలవారీ ఫ్రీ లిమిట్ కిందకే వస్తాయి. 5 లావాదేవీల కంటే ఎక్కువ చేస్తే ప్రతి విత్‌డ్రాయల్‌కు ₹23 + టాక్స్ వసూలు చేస్తారు.
  • Bandhan Bank: మెట్రో నగరాల్లో 3, ఇతర ప్రాంతాల్లో 5 సార్లు మాత్రమే ఉచితం. ఆ తర్వాత ₹23 చార్జీ పడుతుంది. బ్యాలెన్స్ లేక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ₹25 పెనాల్టీ పడుతుంది.
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కొన్ని రకాల డెబిట్ కార్డులపై డైలీ విత్‌డ్రాయల్ లిమిట్‌ను తగ్గించింది. గతంలో ₹1 లక్ష వరకు ఉన్న లిమిట్‌ను ఇప్పుడు కార్డు రకాన్ని బట్టి ₹50,000 నుండి ₹75,000 వరకు పరిమితం చేశారు.