Bengaluru : ఒరేయ్ అది ఇల్లా, జైలా.. ఖైదీలు ఫోన్ల వాడకం.. టాయిలెట్ పైపుల్లో దాచి

Bengaluru

Bengaluru :  బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో భద్రతా వైఫల్యం బయటపడింది. ముగ్గురు విచారణా ఖైదీలు ఏకంగా జైలు లోపలే మొబైల్ ఫోన్లు వాడుతూ వీడియోలు తీయడమే కాకుండా, సాక్షాత్తూ జైళ్ల శాఖ డిజిపి అలోక్ కుమారే తమకు ఫోన్లు ఇచ్చారంటూ అబద్ధపు ప్రచారం చేశారు.

జైలులో అక్రమాలను అరికట్టేందుకు డిజిపి అలోక్ కుమార్ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. దీనిపై కోపంతో ఉన్న ఖైదీలు, ఆయన్ని బద్నాం చేయడానికి ప్లాన్ వేశారు. వీడియోలో ఖైదీలు ఫోన్లు వాడుతూ కనిపించారు. అంతేకాకుండా మార్చి 28న జరిగిన RCB vs SRH మ్యాచ్ గురించి ప్రస్తావిస్తూ.. “ఈ సాలా కప్ నమ్దే” అంటూ జోకులు వేశారు. పోలీసులు సోదాలు చేయగా, టాయిలెట్ పైపుల్లో పాలు ప్యాకెట్లలో దాచి ఉంచిన రెండు మొబైల్ ఫోన్లు దొరికాయి.

https://twitter.com/arivuexpress/status/2038220169286430959

ఈ ఘాతుకానికి ఒడిగట్టిన వారిని హత్య కేసులో నిందితులుగా ఉన్న దర్శన్, అతని తమ్ముడు అభిగా గుర్తించారు. వీరికి జిప్సిన్ డేనియల్ అనే మరో ఖైదీ సహకరించాడు. వీరంతా సుంకాడకట్టే రక్షిత్ గ్యాంగ్‌కు చెందిన వారని తెలిసింది. జైలు అధికారులు ఇటీవల ఖైదీల పేర్ల ప్రకారం బారకాసులను మార్చడం మొదలుపెట్టారు. దీనివల్ల ఖైదీల మధ్య ఉన్న పాత నెట్‌వర్క్ తెగిపోయింది. ఈ కొత్త రూల్స్‌పై కోపంతోనే అధికారులను బ్లాక్ మెయిల్ చేయడానికి ఈ వీడియోలు లీక్ చేశారు.

విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు వార్డర్లను (నిరంజన్, హనుమంతప్ప, శివానంద్) సస్పెండ్ చేశారు. జైలు ఆవరణలో సిగ్నల్స్ ఎలా వస్తున్నాయని ఎయిర్‌టెల్ సంస్థకు కూడా అధికారులు వార్నింగ్ ఇచ్చారు.