Honey Rose : కేరళలో జరిగిన ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో హీరోయిన్ హనీరోజ్‌కు ఊహించని విధంగా ఒక చేదు అనుభవం ఎదురైంది. తన అందచందాలతో, నటనతో కుర్రకారును మాయ చేసే ఈ బ్యూటీని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే, ఆ అభిమానమే ఒక్కసారిగా హద్దులు దాటి ఆమెకు చికాకు తెప్పించింది.
కేరళలోని ఒక కొత్త మాల్‌ను ప్రారంభించేందుకు హనీరోజ్ ముఖ్య అతిథిగా వెళ్లారు. ఆమె రాకతో మాల్ ఆవరణ అంతా సందడిగా మారింది. మొదట్లో అంతా సాఫీగానే సాగినా, ఒక్కసారిగా అభిమానులు సెల్ఫీల కోసం ఆమె మీదకు దూసుకువచ్చారు. ఆ తోపులాటలో జనం నియంత్రణ కోల్పోయారు. ఈ క్రమంలోనే కొందరు ఆకతాయిలు అతిగా ప్రవర్తించి, సెల్ఫీ నెపంతో ఆమెను అసభ్యంగా తాకారు. ముఖ్యంగా ఆమె నడుము భాగంలో కొందరు కావాలనే చేతులు వేయడంతో హనీరోజ్ తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆ పరిస్థితిని భరించలేక, తీవ్ర అసహనంతో ఆమె వెంటనే వేడుక మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Actress Honey Rose had an unpleasant experience at a shopping mall event in Kerala after some people allegedly behaved inappropriately while trying to take selfies.
The viral video is now drawing criticism, with many calling for basic respect and proper behaviour towards women… pic.twitter.com/qToMEixFim
— TeluguBulletin.com (@TeluguBulletin) March 30, 2026
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. ఇది చూసిన నెటిజన్లు సదరు ఆకతాయిలపై మండిపడుతున్నారు. “స్టార్లకు ప్రైవసీ ఉండదా? అభిమానం అంటే ఇలా వేధించడమా?” అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా లేడీ సెలబ్రిటీలు బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు కనీస భద్రత లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
హనీరోజ్ కేవలం మలయాళంలోనే కాకుండా, తెలుగులో ‘వీరసింహారెడ్డి’ సినిమాతో ఇక్కడి ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు. తన గ్లామర్‌తో సోషల్ మీడియాలో కూడా ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇంతటి పాపులారిటీ ఉన్న నటికే ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై హనీరోజ్ నేరుగా ఇంకా స్పందించకపోయినా, ఆమె అభిమానులు మాత్రం ఆమెకు అండగా నిలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
