Bandla Ganesh : తెలుగు సినీ పరిశ్రమలో తనదైన స్టైల్‌తో గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన మాట్లాడే మాటలు, సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్‌లు ఎంత వైరల్ అవుతాయో మనందరికీ తెలిసిందే. తాజాగా బండ్ల గణేష్ ఇంట్లో ఒక తీపి కబురు వినిపిస్తోంది. ఆయన గారాల పట్టి జనని వివాహం నిశ్చయమైంది. దీంతో గణేష్ ఇంట్లో ఇప్పుడు పెళ్లి సందడి మొదలైపోయింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో జనని, ఆమె కాబోయే భర్తకు సంబంధించిన ఫోటోలు తెగ హల్చల్ చేస్తున్నాయి. నిశ్చితార్థానికి సంబంధించినవిగా భావిస్తున్న ఈ చిత్రాల్లో జంట చాలా చూడముచ్చటగా ఉంది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు “అరే.. బండ్ల గణేష్ గారికి ఇంత పెద్ద కూతురు ఉందా?” అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాబోయే అల్లుడు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడని, ఈ జోడీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Wedding celebrations begin at Bandla Ganesh’s home 🎉
Tollywood producer Bandla Ganesh’s daughter, Janani, is all set to tie the knot. Photos from the Haldi ceremony are going viral on social media.
Introducing his future son-in-law, Suryateja Chilukuri, #BandlaGanesh shared… pic.twitter.com/Nt4dy1qEjt
— CineAura (@CineAuraX) April 3, 2026
బండ్ల గణేష్ కుమార్తెను చేసుకోబోయే అబ్బాయి ఒక ప్రతిష్టాత్మక కుటుంబానికి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. అయితే ఆ అబ్బాయి బ్యాక్ గ్రౌండ్ గురించి గణేష్ ఇంకా అధికారికంగా ఎక్కడా వెల్లడించలేదు. కూతురి పెళ్లి అనేది ప్రతి తండ్రికి ఒక పెద్ద కల. ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ స్టార్లందరూ తరలి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
బండ్ల గణేష్ సినిమా తీసినా.. వేడుక చేసినా చాలా గ్రాండ్‌గా ఉంటుంది. అలాగే తన కుమార్తె వివాహాన్ని కూడా అత్యంత వైభవంగా జరిపించే ప్లాన్‌లో ఉన్నారట. పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన భక్తి చూపే బండ్ల గణేష్, తన కూతురి పెళ్లికి పవర్ స్టార్‌ను తప్పకుండా ఆహ్వానిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. పెళ్లి తేదీపై ఇంకా స్పష్టత రానప్పటికీ, హైదరాబాద్‌లోని ఒక భారీ కన్వెన్షన్ సెంటర్లో ఈ బ్లాక్ బస్టర్ వెడ్డింగ్ జరగనుంది.
ఈ ఫోటోలు బయటకు వచ్చినప్పటి నుండి అభిమానులు బండ్ల గణేష్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. “కంగ్రాట్స్ బండ్ల అన్న”, “పెళ్లి వేడుక అదిరిపోవాలి” అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
బండ్ల గణేష్‌కు ఇద్దరు కుమారులు హితేష్, హిరేష్లతో పాటు కూతురు జనని ఉన్నారు. వీరితో పాటుగా 2021లో ఆయన తన భార్యకు రోడ్డుపై దీనస్థితిలో ఒక నేపాలీ చిన్నారి కనిపించిందని, ఆ పాపను తాము దత్తత తీసుకున్నామని మనసు విప్పారు. అంటే జనని సొంత కూతరే అన్నమాట.
