Meher Ramesh : అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో అనౌన్స్ అయిన ‘రాక’ మూవీ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో చర్చలకు దారితీస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనను తాను పూర్తిగా మార్చుకుని, ఒక జంతువులాంటి భీభత్సమైన లుక్‌లో కనిపించడం చూసి అభిమానులు షాక్ అయ్యారు. ‘పుష్ప 2’ లో అమ్మవారి గెటప్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బన్నీ, ఇప్పుడు మళ్ళీ ఇలాంటి సాహసోపేతమైన ప్రయోగం చేయడం హాట్ టాపిక్ అయ్యింది.
అయితే ఈ లుక్ పట్ల నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఆయన ప్రయోగాన్ని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం చిత్రమైన పోలికలతో ట్రోలింగ్ మొదలుపెట్టారు.
Meher Ramesh ruling Tollywood 🥳
Rudra in Varanasi
Raaka in Raaka https://t.co/6pubxcKRmG— Johnnie Walker (@JohnnyWalkcer) April 8, 2026
ముఖ్యంగా ‘రాక’ అనే టైటిల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘శక్తి’ సినిమాలో విలన్ పేరు కూడా ‘రాక’. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో, ఇప్పుడు అదే పేరును బన్నీ సినిమాకు పెట్టడంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ‘శక్తి’ చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ పేరు కూడా అనూహ్యంగా ఎక్స్ లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. పాత సినిమాల రిఫరెన్సులను బయటకు తీస్తూ కొందరు నెటిజన్లు సరదాగా ట్రోల్ చేస్తుండటంతో వాతావరణం వేడెక్కింది.
అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఈ ట్రోలింగ్‌ను తీవ్రంగా ఖండిస్తున్నారు. కావాలనే పాత ఫ్లాప్ సినిమాలను, ఇతర దర్శకులను తెరపైకి తెచ్చి నెగిటివిటీ పెంచుతున్నారని వారు మండిపడుతున్నారు. స్టార్ హీరో అయి ఉండి కూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి, ప్రతి సినిమాలోనూ కొత్తగా ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తున్న బన్నీని అభినందించాల్సింది పోయి ఇలా ఎగతాళి చేయడం సరికాదని వారు వాదిస్తున్నారు.
ఏది ఏమైనా ‘రాక’ ఫస్ట్ లుక్ మాత్రం అటు నెగిటివ్, ఇటు పాజిటివ్ కామెంట్లతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
