Balmoor Venkat : MLC బల్మూర్ వెంకట్ పెళ్లి.. ఎవరీ ఇందుజ?

Induja Gaddam

Balmoor Venkat  : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చురుకైన యువ నాయకుడిగా గుర్తింపు పొందిన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఆయన వివాహం ఇందుజ గడ్డంతో గోవాలోని ఒక ప్రైవేట్ రిసార్ట్ లో జరిగింది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత బంధువులు మరియు అతి కొద్ది మంది రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.

బల్మూర్ వెంకట్ విద్యార్థి దశ నుంచి (NSUI) రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగారు. మరోవైపు ఇందుజ గడ్డం కూడా జగిత్యాల జిల్లాలో యువజన కాంగ్రెస్ నేతగా ఉన్నారు. ఇద్దరూ రాజకీయ నేపథ్యం గల వారు కావడంతో పార్టీ వర్గాల్లో ఈ వివాహం ఆసక్తికర చర్చకు దారితీసింది.

వివాహం గోవాలో ప్రైవేట్‌గా జరిగినప్పటికీ, త్వరలోనే హైదరాబాద్‌లో పార్టీ నాయకులు కోసం ప్రత్యేక రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. వెంకట్-ఇందుజ దంపతుల వివాహం విషయం తెలియగానే సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also Read :