Mangli : టాలీవుడ్ పాపులర్ సింగర్ మంగ్లీ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. తనను ఏకంగా 10 కోట్ల రూపాయల మేర మోసం చేసిందంటూ ఒక వ్యక్తి పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. కేవలం డబ్బు విషయమే కాకుండా, ఆమె వల్ల తన ప్రాణాలకు కూడా ముప్పు ఉందని సదరు బాధితుడు ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం.
ఈ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. మంగ్లీతో పాటు ఆమె సోదరుడు, మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. కొత్త చట్టం BNS సెక్షన్ 351(2), 352 కింద వీరిపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది.
నిజానికి ‘తీన్మార్’ వార్తలతో కెరీర్ మొదలుపెట్టి, తన తెలంగాణ జానపద పాటలతో సోషల్ మీడియాను ఊపేసిన మంగ్లీ, ఆ తర్వాత సినిమాల్లో ‘రాములో రాములా’, ‘సారంగదరియా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో టాప్ సింగర్‌గా ఎదిగారు. ఇలాంటి సమయంలో ఆమెపై ఇలాంటి భారీ మోసం కేసు నమోదు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వివాదంపై మంగ్లీ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
