Vishnupriya : యాంకర్ విష్ణుప్రియ భీమినేనికి బిగ్ షాక్ తగిలింది. ఇన్స్టాగ్రామ్ వంటి వేదికలను ఉపయోగించుకుని అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్నారన్న ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదైంది. ఐఎస్ఎఫ్ (AISF) నాయకులు విజయవాడలోని సూర్యారావుపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

విష్ణుప్రియ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ప్రత్యేక వీడియోలను వీక్షించాలంటే నగదు చెల్లించి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని ప్రచారం చేస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సాయికుమార్ ఆరోపించారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా పెట్టుకుని, అర్ధనగ్న ప్రదర్శనలతో కూడిన వీడియోలను ఇలాంటి పెయిడ్ ప్లాట్‌ఫారమ్స్ ద్వారా ప్రచారం చేయడం అనైతికమని మండిపడుతున్నారు.
విష్ణుప్రియ అర్ధనగ్న ఫొటోలు పోస్ట్ చేశారని ఫిర్యాదు.. కేసు నమోదు
A case has been registered at the Vijayawada Cyber Crime Police Station against anchor and Bigg Boss fame Vishnupriya Bheemineni. AISF leaders filed a complaint alleging that she has been posting obscene and… pic.twitter.com/GoLcZaYXtN
— Milagro Movies (@MilagroMovies) April 12, 2026
సమాజంలో సెలబ్రిటీలు యువతకు రోల్ మోడల్స్‌గా ఉండాలని, కానీ విష్ణుప్రియ వంటి వారు కాసుల కోసం కక్కుర్తి పడి విచ్చలవిడితనాన్ని, నైతిక విలువలు లేని సంస్కృతిని ప్రోత్సహించడం సిగ్గుచేటని విమర్శించారు.
ఈ క్రమంలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వారు రెండు కీలక డిమాండ్లను ఉంచారు. మొదటిది ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను తక్షణమే బ్లాక్ చేయాలని కోరారు. ఇక రెండోది, ఐటీ చట్టంలోని కఠిన నిబంధనలతో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద ఆమెపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, లోతైన విచారణ చేపట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ నాయకులు దీపక్, సిద్దు, మనోజ్ తదితరులు మాట్లాడుతూ.. సెలబ్రిటీలు తమ పరిధి దాటి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని, నైతికతను పాడుచేసే ఇలాంటి చర్యలపై న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
