BIG BREAKING : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఈ ఉదయం 11 గంటలకు ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా కలిసి ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, ఫలితాల ప్రకటన ముగిసిన వెంటనే మార్కుల మెమోలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరిగాయి.
జనరల్,ఒకేషనల్ కలిపి మొత్తం 70.58 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఫస్టియర్ మొత్తం విద్యార్థులు 4,89,123 మంది..
పాసైన విద్యార్థులు 3,23,807 మంది..
ఇంటర్ ఫస్టియర్ ఉత్తీర్ణత శాతం 66.02..
బాలికల ఉత్తీర్ణత 74.4 శాతం..
బాలుర ఉత్తీర్ణత 57.69 శాతం.
సెకండియర్ మొత్తం విద్యార్థులు 5,07,948..
సెకండియర్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు 3,58,490 మంది..
సెకండియర్‌లో ఉత్తీర్ణత శాతం 70.58..
బాలికల ఉత్తీర్ణత 78.65 శాతం..
బాలుర ఉత్తీర్ణత 62.5 శాతం..
ఫలితాల కోసం అధికారిక వెబ్సైట్లు:
ఫలితాలను చెక్ చేసుకునే విధానం:
హోమ్ పేజీలో మీ సంవత్సరానికి సంబంధించిన (1st Year లేదా 2nd Year) ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
మీ హాల్ టికెట్ నంబర్‌ను నిర్ణీత బాక్సులో ఎంటర్ చేయండి.
‘Submit’ బటన్‌ను క్లిక్ చేయగానే మీ మార్కుల మెమో స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతుంది. భవిష్యత్తు అవసరాల కోసం దానిని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవడం మర్చిపోకండి.
ముఖ్య సమాచారం:
ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 35% మార్కులు సాధించిన విద్యార్థులను ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు.
ఇంటర్నెట్ సదుపాయం లేని వారు మొబైల్ నుండి SMS ద్వారా కూడా రిజల్ట్స్ పొందవచ్చు. మొదటి సంవత్సరం విద్యార్థులు TSGEN1 <హాల్ టికెట్ నంబర్> టైప్ చేసి 56263 కు సందేశం పంపాలి.
ఇటు సప్లమెంటరీ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బోర్డు ఖరారు చేసింది. తమకు వచ్చిన మార్కులపై ఏవైనా సందేహాలు ఉన్నా లేదా తక్కువ మార్కులు వచ్చాయని భావించినా విద్యార్థులు రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన విండో ఏప్రిల్ 13వ తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్ 20వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ గడువులోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల వివరాలను కూడా వెల్లడించారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 20వ తేదీ లోపు పరీక్షా ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఎంతో కీలకమైన ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఈ పరీక్షలను ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించనున్నారు.
