Hanamkonda : హన్మకొండ జిల్లా తాడ్వాయిలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి జీవించాలనే మోజులో పడి, 15 ఏళ్ల బంధాన్ని కాదనుకుని, ఇద్దరు బిడ్డల తండ్రిని అత్యంత కిరాతకంగా చంపించింది ఓ భార్య. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
తాడ్వాయికి చెందిన సుమన్, లావణ్యలకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే, కొంతకాలంగా లావణ్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం భర్త సుమన్‌కు తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన లావణ్య, ఎలాగైనా అతడిని అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది.
తన ప్రియుడితో కలిసి సుమన్‌ను అంతమొందించేందుకు ఒక సుపారీ గ్యాంగ్‌ను ఆశ్రయించింది. ప్లాన్ ప్రకారం.. సుమన్‌ను ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన సుపారీ గ్యాంగ్, అతడిపై బీరు సీసాలతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణంగా చంపేశారు. అనంతరం గుర్తింపు దొరకకుండా ఉండేందుకు మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు.
ప్రియుడి మోజులో పడి సుపారీ గ్యాంగ్‌తో భర్తను హత్య చేయించిన భార్య
హన్మకొండ జిల్లా తాడ్వాయిలో 15 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న సుమన్, లావణ్య.. వీరికి ఇద్దరు కుమార్తెలు
లావణ్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడగా.. ఈ విషయం భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు
దీంతో… pic.twitter.com/rk5zmBxjvE
— Telugu Scribe (@TeluguScribe) April 16, 2026
సుమన్ కనిపించకుండా పోవడం, లావణ్య ప్రవర్తనలో మార్పులు గమనించిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో లావణ్య తడబడటంతో అనుమానం వచ్చి గట్టిగా నిలదీయగా.. అసలు నిజం బయటపడింది. ప్రియుడి మోజులో పడి భర్తను తానే సుపారీ ఇచ్చి చంపించినట్లు ఆమె ఒప్పుకుంది. దీంతో పోలీసులు లావణ్యను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. తల్లి చేసిన ఈ దారుణానికి ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా మారడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
