Union Budget :భారత ఆర్థిక, రాజకీయ చరిత్రలో 1999 బడ్జెట్‌కు ఒక ప్రత్యేక అధ్యాయం ఉంది. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఫిబ్రవరి 27వ తేదీన బడ్జెట్‌ను(Union Budget) ప్రవేశపెట్టారు.
దశాబ్దాలుగా వస్తున్న బ్రిటిష్ కాలం నాటి సంప్రదాయాన్ని మారుస్తూ సాయంత్రం 5 గంటలకు కాకుండా ఉదయం 11 గంటలకే బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించి ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. దాదాపు రూ. 2.83 లక్షల కోట్ల వ్యయంతో రూపొందించిన ఆ బడ్జెట్‌లో గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేశారు.
అయితే, ఆ బడ్జెట్ ఆనందం వాజ్‌పేయి ప్రభుత్వానికి ఎంతో కాలం నిలవలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన కొద్ది రోజులకే రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే (AIADMK) అధినేత్రి జయలలిత మద్దతు ఉపసంహరించుకోవడంతో పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ఎదురైంది. అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఆ ఓటింగ్‌లో వాజ్‌పేయి ప్రభుత్వం కేవలం ఒక్క ఓటు తేడాతో కుప్పకూలిపోయింది.
బడ్జెట్ ఆమోదం పొందిన వెంటనే ప్రభుత్వం పడిపోవడంతో దేశం మరోసారి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. అందుకే బడ్జెట్ చరిత్రలో 1999 సంవత్సరం ఒక మరిచిపోలేని అధ్యాయంగా మిగిలిపోయింది. మళ్ళీ 27 ఏళ్ల తర్వాత ఇప్పుడు 2026లో నిర్మలా సీతారామన్ ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది.
యశ్వంత్ సిన్హా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ద్వారానే గోల్డ్ డిపాజిట్ స్కీమ్ వంటి వినూత్న ఆలోచనలు తెరపైకి వచ్చాయి. ఇది ఆధునిక భారత ఆర్థిక సంస్కరణలకు ఒక పునాదిగా నిలిచిపోయింది.. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత 2026లో నిర్మలా సీతారామన్ ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టడం విశేషం.
