BIG BREAKING : హైదరాబాద్లోని టోలీచౌకిలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో మొత్తం 10 మంది కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు సమాచారం. భవన నిర్మాణం జరుగుతుండగా స్లాబ్ లేదా సెంట్రింగ్ కూలడం వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
BIG BREAKING : టోలీచౌకిలో ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్!
