Mahabubabad : డాక్టర్ కాదు కామాంధుడు.. చితకబాదిన యువతి బంధువులు!

doctor

Mahabubabad : మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఓ ఆర్ఎంపీ డాక్టర్ బరితెగించాడు. చికిత్స కోసం వచ్చిన యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితురాలి బంధువులు, స్థానికులు దేహశుద్ధి చేశారు.ఇక వివరాల్లోకి వెళ్తే.. తొర్రూరు పట్టణానికి చెందిన ఒక 21 ఏళ్ల దళిత యువతి శనివారం రాత్రి తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ స్థానిక ప్రైవేట్ క్లినిక్‌కు వెళ్లింది. అక్కడ చికిత్స అందిస్తున్న డాక్టర్ కిరణ్ కుమార్ ఆమెకు ఇంజక్షన్ ఇచ్చారు.

ఆ తర్వాత తనలోని కామాంధుడిని బయటకు తెచ్చాడు. ఒంటరిగా ఉన్న యువతిని చూసి డాక్టర్ కిరణ్… నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటూ అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ వేధించడం మొదలుపెట్టాడు. డాక్టర్ ప్రవర్తనతో హడలిపోయిన ఆ యువతి వెంటనే తన తల్లికి వెళ్లి చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహంతో ఊగిపోతూ పెద్ద సంఖ్యలో క్లినిక్‌కు చేరుకున్నారు.

అక్కడికి వెళ్లి డాక్టరును నిలదీశారు. ఆగ్రహం తట్టుకోలేక డాక్టరును చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన డాక్టరును అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

బాధిత యువతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక వైద్యుడై ఉండి, రోగి పట్ల ఇలాంటి నీచమైన చర్యకు పాల్పడటంపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.