Maharashtra : ట్రాన్స్‌జెండర్‌తో మంత్రి రాసలీలలు…వీడియోలు ఫుల్ వైరల్ !

Maharashtra

Maharashtra :  మహారాష్ట్ర రాజకీయాల్లో మరో భారీ వివాదం చెలరేగింది. రాష్ట్ర ఆహార, మంత్రి, ఎన్సీపీ నేత నరహరి జిర్వాల్ ఒక ట్రాన్స్‌జెండర్‌తో కలిసి ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (MVA) మండిపడుతోంది. తన అధికారిక నివాసంలోనే ఈ వీడియో చిత్రీకరించినట్లు ప్రచారం జరుగుతుండటంతో, ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

గడిచిన రెండు నెలల్లో జిర్వాల్ చిక్కుకున్న రెండో వివాదం ఇది. గతంలో ఆయన శాఖలోని ఒక క్లర్క్ రూ.35,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడటం సంచలనం సృష్టించింది. తాజా వీడియోపై జిర్వాల్ ఇంకా స్పందించనప్పటికీ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం సునేత్రా పవార్‌లకు ఆయన వివరణ ఇచ్చినట్లు సమాచారం.

అజిత్ పవార్ మరణం తర్వాత పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాలే ఈ వీడియో లీక్ కావడానికి కారణమని కొందరు భావిస్తున్నారు. ఈ వీడియో సుమారు ఏడు నెలల క్రితం నాటిదని ఎన్సీపీ ఎమ్మెల్సీ అమోల్ మిత్కారీ పేర్కొన్నారు. మంత్రిని రాజకీయంగా దెబ్బతీయడానికే ఇప్పుడు దీనిని బయటపెట్టారని ఆయన ఆరోపించారు. కాగా, ఆ వీడియోలోని వ్యక్తిని పవన్ యాదవ్ అని గుర్తించారు. సదరు వ్యక్తికి ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ చరిత్ర ఉందని అతని సోదరుడే చెప్పడం గమనార్హం.

“జిర్వాల్ ఎవరో అందరికీ తెలుసు.. దీని గురించి మాట్లాడటం కూడా సిగ్గుచేటు” అని సంజయ్ రౌత్ (శివసేన UBT) విమర్శించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో నైతిక విలువలు పతనమవుతున్నాయని, ఇలాంటి అశ్లీల ప్రవర్తన రాష్ట్ర ప్రతిష్టకు మాయని మచ్చని ప్రియంకా చతుర్వేది ధ్వజమెత్తారు. నైతిక బాధ్యత వహిస్తూ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని సీఎంను హర్షవర్ధన్ సపల్ (కాంగ్రెస్) డిమాండ్ చేశారు.