BIG BREAKING : బిహార్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ శకం ముగిసింది. గత 21 ఏళ్లుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్న జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీష్ కుమార్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించారు.
రాష్ట్రంలో చోటుచేసుకున్న వేగవంతమైన రాజకీయ పరిణామాల మధ్య ఈ నిర్ణయం వెలువడింది. ఈ రోజు ఉదయం నితీష్ కుమార్ తన చివరి క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, రాజీనామా సమర్పించే ముందు మంత్రి మండలిని రద్దు చేస్తున్నట్లు తన సహచర మంత్రులకు ఆయన అధికారికంగా తెలియజేశారు.
