BIG BREAKING : లోక్‌సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!

BIG BREAKING

BIG BREAKING :  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందలేకపోయింది. మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు సంబంధించి కీలక సవరణలు సూచిస్తూ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు సరిపడా మెజారిటీ లభించకపోవడంతో వీగిపోయింది.

బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో మొత్తం 528 ఓట్లు పోలయ్యాయి. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల (2/3) మెజారిటీ సాధించడంలో ప్రభుత్వం విఫలమైంది. అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు పోలయ్యాయి

131వ సవరణ బిల్లు వీగిపోవడంతో దీనికి అనుబంధంగా ఉన్న మరికొన్ని బిల్లులపై కూడా ప్రభావం పడింది. దీంతో డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) సవరణ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లులను కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.