BIG BREAKING : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 నియోజకవర్గాల్లో ముందంజలో ఉండి సంచలనం సృష్టించిన విజయ్ పార్టీ (TVK), ఇప్పుడు మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. విజయ్ తాను పోటీ చేసిన పెరంబూర్, త్రిచ్చి ఈస్ట్ రెండింటిలోనూ గెలిచారు. అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయన ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం విజయ్ పెరంబూర్ స్థానాన్ని ఉంచుకుని, త్రిచ్చి ఈస్ట్ నియోజకవర్గాన్ని వదులుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, ఖాళీ అయ్యే త్రిచ్చి ఈస్ట్ స్థానం నుండి కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. విజయ్ తన సీటును త్రిషకు అప్పగించే అవకాశం ఉందని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. త్రిష నిన్న విజయ్ నివాసానికి వెళ్లిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడ దీని గురించే చర్చ జరిగిందని తెలుస్తోంది.
ఒకవేళ త్రిష బరిలోకి దిగితే, త్రిచ్చి ఈస్ట్ ఉప ఎన్నిక రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారనుంది. ఇక ఇప్పటికే త్రిషకు రాజకీయాలు అంటే చాలా ఇంట్రెస్ట్ అని పలుసార్లు మీడియాకు తెలిపింది. ఏకంగా తనకు సీఎం కావాలని ఉందంటూ ఆమె చెప్పుకొచ్చింది.
ఇప్పుడు TVK అధికారంలోకి వచ్చింది. సీఎంగా విజయ్ ఉంటారు కాబట్టి.. త్రిష ఎమ్మెల్యేగా గెలవడం పెద్ద విషయం కాకపోవచ్చు.. ఇప్పుడు వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ప్రకారం… సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం చేసిన రోజే త్రిష కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని బలంగా టాక్ నడుస్తోంది. విజయ్ క్యాబినేట్ లో ఆమెకు కీలక శాఖ ఉండబోతుందని తమిళనాడులో వార్తలు వస్తున్నాయి. ఆమె మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే రాబోయే ఆరు నెలల్లో MLA/MLC కావాల్సి ఉంటుంది.
