H-1B Visa : అమెరికా వెళ్లాలని కలలు కనేవారికి, ముఖ్యంగా యంగ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఇదో బ్యాడ్ న్యూస్. ట్రంప్ ప్రభుత్వానికి అత్యంత సన్నిహితులు, రిపబ్లికన్ ఎంపీలు కలిసి అమెరికా పార్లమెంట్ లో కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. అదే ‘End H-1B Visa Abuse Act of 2026’. ఈ బిల్లులో ఉన్న అసలు మ్యాటర్ ఏంటి? నిజంగానే వీసాలు ఆగిపోతాయా? ఒకవేళ ఈ బిల్లు పాస్ అయితే భారతీయుల పరిస్థితి ఏంటి? దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటో క్లియర్ గా తెలుసుకుందాం.
இந்தியர்களை ரவுண்டு கட்டி அடிக்கும் டிரம்ப்: 3 ஆண்டுகளுக்கு எச் – 1பி விசா வழங்க தடை? அமெரிக்காவின் புதிய மசோதாhttps://t.co/TsOuM67Nu7#america #h1bvisa #internationalnews #ietamil
— Indian Express Tamil (@IeTamil) April 25, 2026
ఈ బిల్లును ఎలీ క్రేన్ అనే ఓ ఎంపీ ప్రవేశపెట్టారు. ఇందులో ఉన్న పాయింట్లు వింటే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. అవేంటంటే..
1. వచ్చే మూడేళ్ల వరకు కొత్త H-1B వీసాలను అసలు ఇవ్వకూడదు.
2. ప్రస్తుతం ఏటా 65,000 వీసాలు ఇస్తుంటే, దాన్ని ఏకంగా 25,000కి తగ్గించేయాలి.
3. ఇప్పటిదాకా లాటరీ పద్ధతిలో వీసాలు ఇచ్చేవారు. కానీ ఇకపై ఎవరికైతే ఏడాదికి కనీసం 2 లక్షల డాలర్లు జీతం ఉంటుందో వారికే వీసా ఇవ్వాలి.
4. H-1B మీద వచ్చే వాళ్లు తమ భార్యాపిల్లలను వెంట తీసుకురాకూడదు.
5. H-1B నుంచి పర్మనెంట్ రెసిడెన్సీ అంటే గ్రీన్ కార్డ్ కి మారకుండా అడ్డుకోవాలి.
ఎందుకు ఈ కఠిన నిర్ణయాలంటే… అమెరికా ఎంపీలు అభిప్రాయం ప్రకారం .. పెద్ద పెద్ద టెక్ కంపెనీలు అమెరికన్లను నియమించుకుంటే ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుందని, అదే పనిని తక్కువ జీతానికే చేసే విదేశీయులను ముఖ్యంగా భారతీయులను H-1B వీసాల మీద తెచ్చుకుంటున్నాయని ఎంపీలు ఆరోపిస్తున్నారు. H-1B వీసాల వల్ల అత్యధికంగా లబ్ధి పొందేది భారతీయులే. దాదాపు 70-80 శాతం వీసాలు ఇండియన్స్ కు వస్తుంటాయి. ఒకవేళ వీసాల సంఖ్యను 65 వేల నుండి 25 వేలకు తగ్గించి, అది కూడా 3 ఏళ్లు ఆపేస్తే.. మన దేశంలోని TCS, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల బిజినెస్ మోడల్ మొత్తం కుప్పకూలుతుంది. ఎందుకంటే ఈ కంపెనీలు తమ ప్రాజెక్టుల కోసం వేల మందిని అమెరికా పంపిస్తుంటాయి.
ఇక చదువు పూర్తయ్యాక ఇచ్చే OPT (ట్రైనింగ్ పీరియడ్) ని కూడా రద్దు చేయాలని ఈ బిల్లులో ఉంది. అంటే చదువు అవ్వగానే స్టూడెంట్స్ వెనక్కి వచ్చేయాల్సి ఉంటుందన్న మాట. థర్డ్ పార్టీ స్టాఫింగ్ ఏజెన్సీల ద్వారా ఉద్యోగులను తీసుకోవడం కూడా బ్యాన్ చేయాలంటున్నారు. మన దగ్గర చాలా మంది విద్యార్థులు అప్పులు చేసి మరి అమెరికాలో మాస్టర్స్ చదవడానికి వెళ్తారు. చదువు అయ్యాక అక్కడ OPTలో ఉద్యోగం చేసి, ఆ తర్వాత హెచ్-1బీ తెచ్చుకుని అప్పులు తీరుద్దామని ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు ఒకవేళ OPT రద్దు చేసి, హెచ్-1బీ కూడా ఆపేస్తే.. చదువుకోసం చేసిన లక్షలాది రూపాయల అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆ కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది.
ఇది చాలా మంది ఐటీ ఉద్యోగులపై ప్రభావం చూపిస్తుంది. 2 లక్షల డాలర్ల జీతం ఇవ్వడం అంటే చిన్న కంపెనీలకు అసాధ్యం. కేవలం గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థలకే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి, ఆటోమేటిక్‌గా విదేశీయులను తీసుకోవడం ఆపేస్తాయి.
భార్యాపిల్లలను వెంట తీసుకురాకూడదు అనే నిబంధన భారతీయులకు ఒక ఎమోషనల్ దెబ్బ. మన వాళ్ళు ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. భార్యను, పిల్లలను ఇండియాలో వదిలేసి, అమెరికాలో ఒంటరిగా ఉండి ఉద్యోగం చేయడం చాలా మందికి ఇష్టం ఉండదు. దీనివల్ల తెలివైన యువత అమెరికా వెళ్లడానికి భయపడుతుంది. ఇక చాలా మంది భారతీయులు పదేళ్ల పాటు అమెరికాలో కష్టపడేది ఎందుకంటే.. ఎప్పటికైనా అక్కడ గ్రీన్ కార్డ్ వస్తుంది, లైఫ్ సెటిల్ అవుతుంది అని. కానీ గ్రీన్ కార్డ్ ఇవ్వం, పని అవ్వగానే వెనక్కి వెళ్ళిపోవాలనే రూల్ పెడితే.. అక్కడ ఇల్లు కొనాలన్నా, పిల్లలను స్కూల్లో వేయాలన్నా ఎవరికీ ఒక భరోసా ఉండదు.
ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చాక H-1B వీసా నిబంధనల్లో భారీ మార్పులు చేశారు. వీటిలో కొన్ని ఇప్పటికే అమల్లోకి రాగా, మరికొన్ని ప్రతిపాదన దశలో ఉన్నాయి. 2025 సెప్టెంబర్ నుండి అమల్లోకి వచ్చిన రూల్ ప్రకారం అమెరికా బయట ఉండి కొత్తగా H-1B వీసా దరఖాస్తు చేసుకునే వారికి $100,000 (దాదాపు రూ. 84 లక్షలు) ఫీజు చెల్లించాలి. ఇప్పటికే H-1B ఉన్నవారికి ఈ ఫీజు వర్తించదు. కానీ వీసాను గ్రీన్ కార్డ్ కింద మార్చుకోవడాన్ని కష్టతరం చేయాలని చూస్తున్నారు. “సో చూశారుగా.. ట్రంప్ టీమ్ నుంచి వచ్చిన ఈ కొత్త బిల్లు అమెరికా వెళ్లాలనుకునే వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
