Skip to content
Wednesday, Jun 24, 2026
  • Twitter
  • Facebook
  • Instagram
  • whatsapp
  • Home
  • Telangana
  • Andhra Pradesh
  • National
  • Finance
  • cinema
  • Health
  • Technology
  • Off Beat
  • Jobs
  • Gallery
Logo

KOTLATA | Telugu News Website

Advertisment Image
Off Beat

NPS Vatsalya Scheme: చిన్న పెట్టుబడితో కోటీశ్వరులు.. నెలకు రూ. 1,000 పెడితే రూ. 11 కోట్లు!

KotlataJanuary 24 1:30 pmJanuary 24 1:32 pm
NPS Vatsalya Scheme

NPS Vatsalya Scheme: దేశంలోని మోదీ సర్కార్ ఎన్నో అద్భుతమైన స్కీమ్స్ అమలు చేస్తోంది. అందులోనే ఓ సూపర్ స్కీమ్ ఎన్‌పీఎస్ వాత్సల్య (NPS Vatsalya Scheme). 2024-25లో కేంద్ర బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ స్కీమ్ ను లాంచ్ చేశారు. చిన్న పిల్లల మీద పెట్టుబడి పెట్టి తల్లిదండ్రులు, సంరక్షకులు పెట్టుబడి పెట్టేలా ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఈ స్కీమ్ ద్వారా పిల్లలు చిన్న వయస్సులో ఉన్నప్పుడే వారి పేరు మీద రిటైర్మెంట్ ఫండ్‌ను రెడీ చేసుకోవచ్చు అన్నమాట.

సాధారణంగా మనం జాబ్ లో చేరిన తర్వాత పెన్షన్ కోసం డబ్బులు దాచుకుంటాం. కానీ, ఈ పథకం ద్వారా పిల్లలు మైనర్లుగా (18 ఏళ్ల లోపు) ఉన్నప్పుడే తల్లిదండ్రులు వారి పేరు మీద పెన్షన్ ఖాతా తెరవడానికి వీలు కలుగుతుంది. 18 ఏళ్ల లోపు వయసున్న ఏ మైనర్ అయినా ఈ పథకానికి అర్హులు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ ఖాతాను నిర్వహిస్తారు. 18 ఏళ్లు నిండిన తర్వాత, ఈ ఖాతా ఆటోమేటిక్‌గా సాధారణ NPS Tier-I ఖాతాగా మారుతుంది. ఆ తర్వాత ఆ పిల్లలే స్వయంగా దీనిని కొనసాగించవచ్చు.

చిన్న వయస్సు నుంచే పెట్టుబడి పెట్టడం వల్ల, 60 ఏళ్లు వచ్చేసరికి భారీ నిధి జమ అవుతుంది. ఉదాహరణకు, నెలకు రూ.1,000 చొప్పున పెట్టుబడి పెడితే రిటైర్మెంట్ నాటికి అది కోట్లలో ఉండే అవకాశం ఉంది.

నెలకు రూ.1,000 పెట్టుబడిపెడితే సంవత్సరానికి రూ.12,000 అవుతుంది. మీరు బిడ్డ పుట్టిన వెంటనే (0 ఏళ్లు) ఈ ఖాతా తెరిచి నెలకు రూ. 1,000 జమ చేస్తే18 ఏళ్ల కాలానికి మొత్తం మీరు జమ చేసిన సొమ్ము రూ.2,16,000 అవుతుంది. 10% రాబడితో వచ్చే మొత్తం: సుమారు రూ. 6,00,000గా ఉంటుంది. 12% రాబడితో వచ్చే మొత్తం సుమారు రూ.7,60,000గా ఉంటుంది. ఈ మొత్తాన్ని 18 ఏళ్ల తర్వాత విత్ డ్రా చేయకుండా అలాగే 60 ఏళ్ల వరకు అంటే రిటైర్మెంట్ వరకు కొనసాగిస్తే, ఆ చక్రవడ్డీ ప్రభావంతో అది కోట్లలోకి మారుతుంది.

ఒకవేళ అదే పెట్టుబడిపై రాబడి 12.85 శాతం వస్తే, ఆ నిధి విలువ అక్షరాలా రూ.11.05 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. అంటే మీరు కేవలం 18 ఏళ్ల పాటు కట్టిన రూ. 2.16 లక్షల సొమ్ము, 60 ఏళ్ల నాటికి ₹11 కోట్లుగా మారుతుందన్నమాట. ఇది కేవలం నెలకు రూ.1,000 పెట్టుబడితో సాధ్యమయ్యే లెక్క. అదే

NPS వాత్సల్యలో అసలైన లాభం18 ఏళ్ల తర్వాతే మొదలవుతుంది. 18 ఏళ్లు నిండాక ఈ ఖాతా సాధారణ NPS ఖాతాగా మారుతుంది. అప్పుడు మీరు కట్టడం ఆపేసినా, అప్పటివరకు జమ అయిన సొమ్ముపై వచ్చే వడ్డీ 60 ఏళ్ల వరకు పెరుగుతూనే ఉంటుంది.

18 ఏళ్ల తర్వాత బిడ్డకు కావాలంటే జమ అయిన మొత్తంలో 20% నగదుగా తీసుకోవచ్చు. మిగిలిన 80% మొత్తాన్ని యాన్యుటీ కింద పెన్షన్ కోసం మళ్లించాలి.

ఇది మ్యూచువల్ ఫండ్స్ తరహాలో మార్కెట్ ఆధారిత పథకం. కాబట్టి రాబడి స్థిరంగా ఉండదు, కానీ దీర్ఘకాలంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడి ఇచ్చే అవకాశం ఉంది.

మీరు బ్యాంకులు, పోస్టాఫీసులు లేదా ఆన్‌లైన్‌లో e-NPS పోర్టల్ ద్వారా ఈ ఖాతాను సులభంగా ప్రారంభించవచ్చు. Birth Certificate, ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్.. తల్లిదండ్రుల KYC పత్రాలు (ఆధార్, పాన్, అడ్రస్ ప్రూఫ్) దీనికి అవసరం.

ఖాతా తెరిచిన 3 ఏళ్ల తర్వాత, పిల్లల విద్య, తీవ్రమైన అనారోగ్యం లేదా వైకల్యం వంటి అత్యవసర అవసరాల కోసం జమ చేసిన మొత్తంలో 25% వరకు వెనక్కి తీసుకోవచ్చు. (మొత్తం మూడు సార్లు మాత్రమే తీసుకోవడానికి వీలుంటుంది).

Also Read :

  • PM SVANidhi credit card : వడ్డీ లేదు.. షూరిటీ లేదు: రూ.50 వేల స్వనిధి క్రెడిట్ కార్డ్ పొందండిలా.. ఎలా అప్లయ్ చేయాలంటే?

  • Donald Trump Gold Prices : ట్రంప్ సెకండ్ ఇన్నింగ్స్‌.. గోల్డ్ రేట్స్ పిచ్చి పిక్స్!

  • Upcoming Smartphones 2026 : ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? ఒక్క వారం ఆగండి.. మార్కెట్లోకి 3 అదిరిపోయే ఫోన్లు!

 

Post navigation

⟵ Donald Trump Gold Prices : ట్రంప్ సెకండ్ ఇన్నింగ్స్‌.. గోల్డ్ రేట్స్ పిచ్చి పిక్స్!
iPhone 18 Pro : ఆపిల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ అప్‌గ్రేడ్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! ⟶

Related Posts

moosapet
Moosapet : పెళ్లైన 5 నెలలకే నవవధువు సూసైడ్!

Moosapet : కూకట్‌పల్లి పరిధిలోని మూసాపేటలో…

Seed Cycling : ఇలా చేయండి ..పిల్లలు పుట్టడం గ్యారెంటీ!

మహిళల సంతానోత్పత్తిలో హార్మోన్లు చాలా కీలకపాత్ర…

New vs Used Car
New vs Used Car: కొత్త కారా..సెకండ్ హ్యాండ్ కారా.. ఏది కొంటే బెస్ట్?

New vs Used Car: ప్రతి…

Recent Posts

  • Doctor Re-Breaks Child’s Leg: లంచం ఇవ్వలేదని.. అతికిన ఎముకను మళ్లీ విరిచిన డాక్టర్
  • Bandla Ganesh : ఒరేయ్ నువ్వెవడివిరా.. ప్రకాశ్ రాజ్‌పై బండ్ల గణేశ్ ఫైర్!
  • Peddi Review : కుమ్మేశావ్ రా చిట్టిబాబు.. రామ్ చరణ్ వన్‌మ్యాన్ షో!
  • Peddi: సరకు, సామాన్లు.. దెబ్బకు ‘చికిరి’ లిరిక్స్ మార్చేశారు!.. కొత్త లిరిక్స్ ఇవే
  • Malvika Nair : బ్లాక్ లెహంగాలో హీట్ పెంచుతున్న మాలవికా.. చూపు తిప్పుకోలేరుగా!
  • Kadapa : కలిసి బతకలేకపోయారు.. మరణంలోనైనా తోడుగా..!
  • Priya Hegde : శారీలోనూ సెగలు పుట్టిస్తున్న ప్రియా హెగ్డే
  • Wayanad : హ్యాట్రిక్ బిస్కెట్.. మంత్రిని ఓడగొట్టిన సామాన్య మహిళ : వాయనాడ్లో సంచలనం
  • Trinamool Congress : ఫస్ట్ వికెట్ పడింది.. మమతకు దిమ్మతిరిగే షాక్ : బాంబు పేల్చిన మాజీ మంత్రి!
  • Tamil Nadu : DMKను సంకనాకించిన ఉదయనిధి.. స్టాలిన్తో పాటు 15 మంది మంత్రులు ఖతం!

Pages

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Homepage
  • Privacy Policy
| Rapid News by Ascendoor | Powered by WordPress.