iPhone 18 Pro : ఐఫోన్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్. వచ్చే సంవత్సరం రాబోయే iPhone 18 Pro మోడల్స్‌లో ఆపిల్ సంస్థ భారీ మార్పులు చేయబోతున్నట్లు తాజా లీకులు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా కొత్త చిప్‌సెట్, కెమెరా టెక్నాలజీ, లాంచ్ ప్లానింగ్‌లో ఆపిల్ ఒక సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. సాధారణంగా ప్రతి ఏడాది ఆపిల్ అన్ని మోడల్స్‌ను ఒకేసారి విడుదల చేస్తుంది. కానీ, 18 సిరీస్‌లో మాత్రం మార్పు ఉండబోతోంది. సెప్టెంబర్ 2026లో ఐఫోన్ 18 ప్రో, ప్రో మాక్స్ మోడల్స్ మాత్రమే విడుదలయ్యే అవకాశం ఉంది.2027 ప్రారంభంలో బేస్ మోడల్ (iPhone 18), iPhone 18e, కొత్త తరం iPhone Air విడుదల అయ్యే అవకాశం ఉంది.
iPhone 18 Series !
iPhone 18
iPhone 18 Air
iPhone 18 Pro
iPhone 18 Pro Max
iPhone 18 Fold pic.twitter.com/8JcfIkPTzT— Silicore (@SilicoreHQ) January 16, 2026
ఐఫోన్ 18 ప్రోలో వాడబోయే A20 Pro చిప్ మొబైల్ రంగంలోనే ఒక సంచలనం కానుంది. ఇది ఆపిల్ యొక్క మొదటి 2nm (నానోమీటర్) ప్రాసెస్ చిప్. దీనివల్ల ఫోన్ వేగం పెరగడమే కాకుండా, బ్యాటరీ లైఫ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇందులో కొత్తగా ‘WMCM’ ప్యాకేజింగ్ టెక్నాలజీని వాడుతున్నారు.
ఐఫోన్ 18 ప్రో వెనుక కెమెరాలో మెకానికల్ ఐరిస్ ఉండబోతోంది. దీనివల్ల తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫోటోలు తీసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ అవసరం లేకుండానే నేచురల్ డెప్త్-ఆఫ్-ఫీల్డ్ పొందవచ్చు.
డిస్‌ప్లే
స్క్రీన్ సైజులు (6.27 ఇంచ్, 6.86 ఇంచ్) మారకపోయినా, డిస్‌ప్లే పైన ఉన్న Dynamic Island స్థానంలో ఒక కొత్త అండర్-డిస్‌ప్లే రాబోతోంది. దీనివల్ల ఫోన్ స్క్రీన్ మరింత స్పష్టంగా, అడ్డంకులు లేకుండా కనిపిస్తుంది.
భారత మార్కెట్లో వీటి ధరలు భారీగానే ఉండనున్నాయి:
iPhone 18 Pro: దాదాపు రూ.1,34,900 నుంచి ప్రారంభం.
iPhone 18 Pro Max: దాదాపు రూ.11,49,900 నుంచి ప్రారంభం.
Also Read :
- PM SVANidhi credit card : వడ్డీ లేదు.. షూరిటీ లేదు: రూ.50 వేల స్వనిధి క్రెడిట్ కార్డ్ పొందండిలా.. ఎలా అప్లయ్ చేయాలంటే?
- Donald Trump Gold Prices : ట్రంప్ సెకండ్ ఇన్నింగ్స్.. గోల్డ్ రేట్స్ పిచ్చి పిక్స్!
- Upcoming Smartphones 2026 : ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? ఒక్క వారం ఆగండి.. మార్కెట్లోకి 3 అదిరిపోయే ఫోన్లు!
