Eswatini : విచ్చలవిడిగా శృంగారం.. ప్రతి నలుగురిలో ఒకరికి HIV

Eswatini

Eswatini :  ఈ దేశం పేరు Eswatini. ఈ దేశం గురించి కొన్ని Shocking Facts మాట్లాడుకుందాం. ఆఫ్రికాలోని బంటు తెగకు చెందిన ప్రజలు సాగు భూముల కోసం వెతుకుతూ ఇప్పుడున్న ఎస్వతిని ప్రాంతానికి చేరుకున్నారు. 19వ శతాబ్దంలో మిగతా ఆఫ్రికా దేశాల్లాగే ఇది కూడా బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళింది. చాలా కాలం పాటు వాళ్ల కంట్రోల్‌లోనే ఉంది. చివరకు 1968, సెప్టెంబర్ 6న ఈ దేశానికి బ్రిటన్ నుండి పూర్తి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి నుండి ఇది ఒక స్వతంత్ర రాజ్యాంగంగా కొనసాగుతోంది. చాలామందికి ఇక్కడ సొంత భూములు ఉండవు. అంతా రాజు ఆధీనంలోనే ఉంటుంది, ప్రజలు కేవలం అక్కడ సాగు చేసుకుంటూ బతకాలి.
————————–
ఇది దక్షిణ ఆఫ్రికాలోని అతిచిన్న దేశం. ఇక్కడ జనాభా కేవలం 12 లక్షలు మాత్రమే. కానీ అందులో దాదాపు 3 లక్షల మందికి HIV Positive ఉంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే, అక్కడ ప్రతి నలుగురిలో ఒకరు ఈ ప్రాణాంతక వైరస్‌తో బాధపడుతున్నారు. అసలు ఒక దేశం మొత్తం ఇలాంటి Health Crisis లోకి ఎలా వెళ్ళింది..? దీని వెనుక ఉన్న కారణాలేంటి..? డీటెయిల్డ్‌గా చూద్దాం.
———————————-
ఇక ప్రపంచంలోనే Highest HIV Prevalence Rate ఉన్న దేశం కూడా ఇదే. ముఖ్యంగా 15 నుండి 49 ఏళ్ల మధ్య ఉన్న Young Generation ఈ వైరస్ బారిన పడటంలో ఎస్వతిని వరల్డ్ లోనే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ప్రతి సంవత్సరం కొత్తగా 7 వేల మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. 1986లో అక్కడ మొదటి కేసు బయటపడింది. ఆ తర్వాత కేవలం కొన్ని దశాబ్దాల్లోనే ఇది ఒక Wildfire లాగా దేశం మొత్తం స్ప్రెడ్ అయ్యింది. అసలు ఇంతలా వ్యాప్తి చెందడానికి కేవలం మెడికల్ రీజన్స్ మాత్రమే కాదు, అక్కడి Socio-Economic పరిస్థితులు కూడా ప్రధాన కారణం.
—————————–
ఇంతలా వ్యాధి పెరగడానికి ఫస్ట్ అండ్ ఫోర్‌మోస్ట్ రీజన్ Extreme Poverty. ఈ దేశంలో దాదాపు 60 శాతం మంది ప్రజలు Below Poverty Lineలో బతుకుతున్నారు. సరైన ఉపాధి లేక అక్కడి మగవారు పక్కనే ఉన్న సౌత్ ఆఫ్రికాలోని Mining Sectorకి కూలీలుగా వెళ్తుంటారు. అక్కడ సరైన అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు అసురక్షిత శృంగారంలో పాల్గొని, తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తమ భార్యలకు కూడా ఈ వైరస్ అంటిస్తున్నారు.
———————-
రెండో కారణం అక్కడి Traditions and Culture. ఇక్కడ ప్రతి ఏటా Reed Dance అనే ఒక పెద్ద కల్చరల్ ఫెస్టివల్ జరుగుతుంది. దీన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి టూరిస్ట్స్ వస్తుంటారు. Reed Dance అంటే ఏంటి అంటే..పెళ్లికాని అమ్మాయిలు సగం దుస్తులతో ఒకచోట చేరి చేసే పండుగ ఇది. ఈ డ్యాన్స్‌లో కేవలం కన్యలు మాత్రమే పాల్గొంటారు. తాము పవిత్రంగా ఉన్నామని నిరూపించుకోవడానికి.. నది దగ్గర నుంచి గడ్డి పోరకను తీసుకుని అక్కడి రాజుకు సమర్పిస్తారు. ఇలా ఈ వేడుకలో డ్యాన్స్ చేసే అమ్మాయిల్లో ఎవరో ఒకరిని రాజు మెచ్చుకుని, తన కొత్త భార్యగా ఎన్నుకుంటాడు. అక్కడ Polygamy అనేది చాలా కామన్. ఆ దేశ రాజే ఈ రీడ్ డాన్స్ లో పాల్గొన్న అమ్మాయిల్లో ఒకరిని ఎంచుకుని పెళ్లి చేసుకుంటారు. రాజుకు ఎంతమంది భార్యలు ఉన్నా.. ప్రతీ ఏటా ఇలా మరో అమ్మాయిని తన భార్యగా ఎంచుకోవడం అక్కడి ఆచారం. ఇక ఈ ఫెస్ట్ ప్రతి ఏడాది ఆగస్టులో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో 8 రోజుల పాటు జరుగుతుంది. దీనిని చూడటానికి చాలామంది టూరిస్టులు వస్తుంటారు. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే.. అక్కడి నిరుపేద మహిళలు డబ్బు కోసం పర్యాటకులతో సంబంధాలు పెట్టుకోవడం వల్ల వైరస్ వేగంగా వ్యాపిస్తోంది.
—————————————
మరో భయంకరమైన విషయం ఏంటంటే, అక్కడ స్కూల్ కి వెళ్లే పిల్లల్లో దాదాపు 18 శాతం మంది టీనేజ్ లోనే ఫిజికల్ రిలేషన్స్ లో పాల్గొంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. చిన్న వయసులోనే ఇలాంటి వాటికి గురికావడం వల్ల Future Generation మొత్తం రిస్క్ లో పడిపోతుంది.
—————– మొత్తంగా ఎస్వతిని దేశం ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి మనకూ హెచ్చరిక. హెల్త్ పట్ల అవగాహన లేకపోతే, దానికి పేదరికం తోడైతే ఒక దేశం ఎంతటి సంక్షోభంలోకి వెళ్తుందో చెప్పడానికి ఇదో నిదర్శనం.
———————————–