Hyderabad : హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సీతారాం ఆత్మహత్య ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. భార్య ప్రవర్తన, ఆమె అక్రమ సంబంధాల వల్ల కలిగిన మనోవేదనను భరించలేక ఫిబ్రవరి 9న ఆయన హుస్సెన్‌సాగర్‌లో దూకి ప్రాణాలు విడిచారు. ఈ విషాద ఘటనకు సంబంధించి సీతారాం రాసిన 19 పేజీల ఆఖరి లేఖ ఇప్పుడు ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది.
2018లో సీతారాం, రేణుకల వివాహం జరిగింది. వీరికి ఏడేళ్లు, ఐదేళ్ల వయసున్న ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా మంచి హోదాలో ఉన్న సీతారాం తన కుటుంబాన్ని, భార్యను ఎంతో అపురూపంగా చూసుకునేవారు. అయితే, పెళ్లైనప్పటి నుండి రేణుకకు ఇతర వ్యక్తులతో సంబంధాలు ఉండేవని, ఎన్నిసార్లు నచ్చజెప్పినా ఆమె పద్ధతి మార్చుకోలేదని సీతారాం తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను కూడా పట్టించుకోకుండా ఇంట్లో వదిలేసి ఆమె బయట తిరిగేదని ఆయన పేర్కొన్నారు.
ఫిబ్రవరిలో సీతారాం చనిపోయాక.. మార్చిలో ప్రియుడిని వివాహం చేసుకున్న రేణుక
సాఫ్ట్‌వేర్ సీతారాం ఆత్మహత్య కేసులో బయటపడుతున్న దారుణ విషయాలు
భర్త చనిపోయి నెల రోజులు గడవక ముందే ప్రియుడు రమణా రెడ్డిని వివాహం చేసుకున్న రేణుక
రేణుకతో పాటు రమణారెడ్డిని అరెస్ట్ చేసిన బాచుపల్లి పోలీసులు https://t.co/WmVLUmAVLH pic.twitter.com/ommI644LZR
— Telugu Scribe (@TeluguScribe) May 1, 2026
ఈ కథనంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే.. సీతారాం తన భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలో రేణుక కొన్ని ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించింది. ఆ వీడియోలను ఆమె తన ప్రియుడు రమణారెడ్డి అనే వ్యక్తికి పంపింది. రమణారెడ్డి ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి సీతారాం పరువు తీయడమే కాకుండా, మానసికంగా వేధించినట్లు లేఖ ద్వారా తెలుస్తోంది. తన భార్యే స్వయంగా తన వ్యక్తిగత వీడియోలను వేరే వ్యక్తికి ఇచ్చిందనే నిజాన్ని సీతారాం తట్టుకోలేకపోయారు.
మధ్యలో తాను మారిపోయానని, ఇకపై బుద్ధిగా ఉంటానని రేణుక సీతారాంను నమ్మించింది. ఒక సందర్భంలో ఆమె ఆత్మహత్యాయత్నం చేయగా, సీతారాం లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆమెను బతికించుకున్నారు. ప్రాణాలు పోయేవరకు వెళ్లి వచ్చినప్పటికీ ఆమె తీరులో మార్పు రాలేదని, మళ్లీ తన పాత పద్ధతుల్లోనే కొనసాగిందని ఆయన వాపోయారు.
చివరికి, భార్య ప్రవర్తనను భరించలేక, సమాజంలో పరువు పోతుందనే భయంతో, తన బాధను ఎవరికీ చెప్పుకోలేక సీతారాం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ 19 పేజీల లేఖ ఇప్పుడు పోలీసుల విచారణలో కీలకంగా మారింది.
