Vijay Net Worth: తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ప్రభంజనం సృష్టించిన నేపథ్యంలో, రాజకీయ నాయకులుగా మారిన స్టార్ల ఆస్తుల వివరాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా దళపతి విజయ్, ఆయనకు అత్యంత సన్నిహితురాలిగా పేరున్న నటి త్రిష ఆస్తుల గురించి నెటిజన్లు తెగ వెతుకుతున్నారు.
2026 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విజయ్ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ మైండ్ బ్లాకింగ్ అని చెప్పాలి. ఆయన మొత్తం ఆస్తులు సుమారు ₹624 కోట్లు. చరాస్తులు ₹404.58 కోట్లు (ఇందులో బ్యాంక్ డిపాజిట్లు, షేర్లు, లగ్జరీ కార్లు ఉన్నాయి). స్థిరాస్తులు ₹220.15 కోట్లు (చెన్నైలోని నీలాంకరై, సాలిగ్రామం వంటి ప్రాంతాల్లో ఖరీదైన బంగ్లాలు, కమర్షియల్ బిల్డింగులు). విజయ్ పేరు మీద 883 గ్రాముల బంగారం ఉండగా, ఆయన భార్య సంగీత పేరిట సుమారు 3 కేజీల బంగారం, వజ్రాలు ఉన్నాయి. రోల్స్ రాయిస్ ఘోస్ట్ నుండి బిఎమ్ డబ్ల్యూ, ఆడి వంటి ప్రపంచ స్థాయి ఖరీదైన కార్లు విజయ్ గ్యారేజీలో ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను విజయ్ ₹184.53 కోట్ల వార్షిక ఆదాయాన్ని ప్రకటించారు.
త్రిష తన ఆస్తుల వివరాలను ఎక్కడా అధికారికంగా ప్రకటించనప్పటికీ, సినీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఆమె ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. ఆమె మొత్తం ఆస్తులు సుమారు రూ. 100 కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతం త్రిష ఒక్కో సినిమాకు ₹5 కోట్ల నుండి ₹10 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు టాక్. చెన్నైలో త్రిషకు సొంత ఇల్లు ఉంది. దీని విలువ సుమారు ₹7 కోట్లు పైనే ఉంటుందని సమాచారం. ఆమె వద్ద మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, బిఎమ్ డబ్ల్యూ 5 సిరీస్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా ఆమె భారీగా ఆర్జిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఆమెకు పెట్టుబడులు ఉన్నట్లు తెలుస్తోంది.
విజయ్ రాజకీయాల్లోకి రావడం, అందులోనూ త్రిష ఆయన పార్టీ తరుపున పోటీ చేస్తారనే వార్తలు రావడంతో వీరిద్దరి ఆస్తుల మధ్య పోలికలు మొదలయ్యాయి. విజయ్ వందల కోట్ల అధిపతిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, ఒకవైపు త్రిష కూడా తన రెండు దశాబ్దాల సినీ కెరీర్లో గట్టిగానే సంపాదించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
