Andhra Pradesh : డిప్యూటీ సీఎం పవన్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

cm chandrababu

Andhra Pradesh :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు, అక్కడ ఆయనను పరామర్శించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు మరియు పాలనాపరమైన అంశాల గురించి ఇద్దరు నేతలు కాసేపు చర్చించారు.

ఈ నెల 19వ తేదీన పవన్ కల్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురవడంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ముక్కుకు సంబంధించిన సమస్య తలెత్తడంతో వైద్యులు అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో ప్రస్తుతం ఆయన తన నివాసంలోనే చికిత్స పొందుతున్నారు. పవన్ పూర్తిగా కోలుకోవడానికి మరో వారం రోజుల సమయం పడుతుందని వైద్యులు సూచించడంతో, అప్పటి వరకు ఆయన విశ్రాంతిలోనే ఉండనున్నారు.