Hyderabad : మాజీ ఆర్మీ ఉద్యోగి ఇంట్లో లిక్కర్ షాపు.. మాములోడు కాదురా అయ్యా!

Hyderabad

Hyderabad : దేశాన్ని కాపాడాల్సిన చేతులు.. దొంగచాటుగా మద్యం అమ్మే దందాకు తెరలేపితే ఎలా ఉంటుంది? అదీ కూడా ఒకటి రెండు సీసాలు కాదు.. ఏకంగా 10 లక్షల విలువైన విదేశీ, డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లు!

ఒక రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తన ఇంటినే ఒక మినీ బార్‌లా మార్చేశాడు. బెంగళూరు నుంచి హర్యానా వరకు నెట్‌వర్క్ నడిపిస్తూ హై-ప్రొఫైల్ వ్యక్తులకు మద్యం సరఫరా చేస్తున్న ఒక భారీ నెట్‌వర్క్‌ను తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు ఛేదించారు. అసలు ఆ ఆర్మీ ఎంప్లాయీ ఎవరు? అన్ని బాటిళ్లు ఇంట్లోకి ఎలా వచ్చాయి? పోలీసులు రాగానే అతను ఏం చేశాడు? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం!

ఏప్రిల్ 21, మంగళవారం రోజు తెలంగాణ ఎక్సైజ్ శాఖకు ఒక పక్కా సమాచారం అందింది. హైదరాబాద్‌లోని ఒక ఇంట్లో భారీగా మద్యం నిల్వలు ఉన్నాయని తేలింది.ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ కిరణ్ ఆధ్వర్యంలో, ఎన్‌ఫోర్స్‌మెంట్ సిఐ సుభాష్ చందర్, ఎస్ఐ అఖిల్ బృందం రంగంలోకి దిగింది. ఇంతకు ఈ నిందితుడి పేరు ఏంటంటే.. దొడ్ల సురేష్ రెడ్డి. వయస్సు 48 ఏళ్లు. ఇతను ఒక మాజీ ఆర్మీ ఉద్యోగి. సైనికులకు డిఫెన్స్ కాంటీన్లలో తక్కువ ధరకు మద్యం లభిస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. కానీ సురేష్ రెడ్డి దీన్ని ఒక వ్యాపారంగా మార్చేశాడు.

సురేష్ రెడ్డి ప్లాన్ మామూలుగా లేదు. బెంగళూరు, హర్యానా రాష్ట్రాల్లోని డిఫెన్స్ కాంటీన్ల నుండి అక్రమంగా మద్యాన్ని సేకరించేవాడు. అక్కడ తక్కువ ధరకు కొని, తెలంగాణకు తీసుకువచ్చి ఇక్కడ భారీ లాభాలకు అమ్మేవాడు. కేవలం సాధారణ వ్యక్తులకు కాదు.. ఇతని కస్టమర్లు అంతా హై ప్రొఫైల్ వ్యక్తులే.. అంటే పార్టీలు, ఫంక్షన్లు చేసుకునే బడా బాబులకు ఈ డిఫెన్స్ లిక్కర్‌ను హోమ్ డెలివరీ చేసేవాడు. ఎక్సైజ్ అధికారులు సురేష్ రెడ్డి ఇంటిపై దాడి చేసినప్పుడు కళ్లు బైర్లు కమ్మే సీన్ కనిపించింది. ఏకంగా 361 లిక్కర్ బాటిళ్లు అక్కడ దొరికాయి. వీటి విలువ దాదాపు 10 లక్షల రూపాయల పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎక్సైజ్ అధికారులు లోపలికి వెళ్తున్న సమయంలో సురేష్ రెడ్డికి విషయం అర్థమైపోయింది. పోలీసులు తనను పట్టుకుంటారని గ్రహించి, అధికారులు లోపలికి వస్తున్న సమయంలోనే అతను ఇంటి వెనుక వైపు నుంచి తప్పించుకుని పరారయ్యాడు. ప్రస్తుతం సురేష్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిజానికి ఆర్మీ వ్యక్తులకు ఇచ్చే కోటా వారి వ్యక్తిగత వినియోగం కోసం మాత్రమే. కానీ దాన్ని ఇలా బయట అమ్మడం అనేది చట్టరీత్యా నేరం. పైగా ఇతర రాష్ట్రాల నుండి అనుమతి లేకుండా మద్యాన్ని తీసుకురావడం కూడా ఎక్సైజ్ నిబంధనల ప్రకారం కఠినమైన శిక్ష పడే అవకాశం ఉన్న కేసు.

చూశారుగా! దేశ రక్షణలో ఉండాల్సిన వారు ఇలాంటి అక్రమ దందాలకు పాల్పడటం నిజంగా బాధాకరం. ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఇలాంటి ‘ఇల్లీగల్ లిక్కర్ స్టాక్స్’ మీద ఎక్సైజ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చే మద్యంపై నిఘా పెంచారు. మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి అక్రమ మద్యం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడటమే కాకుండా, కల్తీ జరిగే ప్రమాదం కూడా ఉంటుంది.