Donald Trump : ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఒకటే టెన్షన్.. ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో? ఎప్పుడు యుద్ధం మొదలవుతుందోనని అంతా భయపడుతున్నారు. కానీ, సరిగ్గా ఇదే టైంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశారు. ఈ శుక్రవారం లోపు మీరు ఒక గుడ్ న్యూస్ వింటారు అంటూ ఆయన ఇచ్చిన హింట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాను షేక్ చేస్తోంది.
కానీ.. సీన్ కట్ చేస్తే, ఇరాన్ మాత్రం ట్రంప్ పచ్చి అబద్ధాల కోరు అని తిట్టిపోస్తోంది. చర్చలు లేవు.. గిర్చలు లేవని ఇరాన్ మీడియా తేల్చి చెప్పింది. మరి ట్రంప్ ఎందుకు అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు? అసలు ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో ఏం జరుగుతోంది? పాకిస్థాన్ ఈ గొడవలోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చింది? అన్నీ ఈ వీడియోలో డెప్త్ గా విశ్లేషిద్దాం.. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ విషయం చాలా సీరియస్!
అసలు ఏం జరిగిందంటే.. రీసెంట్‌గా న్యూయార్క్ పత్రిక ఒక బాంబు లాంటి వార్తను పేల్చింది. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ నుంచి అందిన లీకుల ప్రకారం.. రాబోయే 36 నుంచి 72 గంటల్లో అమెరికా-ఇరాన్ మధ్య సెకండ్ రౌండ్ శాంతి చర్చలు మొదలవుతాయట. దీని గురించి ట్రంప్‌నే అడిగితే.. ఆయన తన స్టైల్లో ఒక మెసేజ్ కొట్టారు. ఇది ఖచ్చితంగా సాధ్యమే అని రిప్లై ఇచ్చారు. అంటే, తెర వెనుక ఏదో జరుగుతోంది! ట్రంప్ లాంటి లీడర్ ఊరికే సాధ్యమే అని అనరు. బహుశా శుక్రవారం లోపు ఏదైనా అగ్రిమెంట్ సంతకం అవుతుందా? లేక బాంబులు ఆగిపోతాయా? అన్నది ఇప్పుడు సస్పెన్స్.
ట్రంప్ గుడ్ న్యూస్ అనగానే ఇరాన్ వాళ్లు ఊరుకుంటారా? ఇరాన్ అధికారిక మీడియా ఒక్కసారిగా విరుచుకుపడింది. ట్రంప్ మళ్ళీ అబద్ధం చెబుతున్నారు.. మా దగ్గర చర్చల ఊసే లేదని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇక్కడ మనం లోతుగా ఆలోచించాల్సింది ఏంటంటే.. ఇరాన్ నాయకత్వం ఇప్పుడు రెండు ముక్కలయ్యింది. ఒక వర్గం చర్చలు జరిపి దేశాన్ని కాపాడుకుందాం అంటుంటే, మరో వర్గం మాత్రం అమెరికా ముందు తలవంచేది లేదని మొండిగా ఉంది. అందుకే ట్రంప్ ఏమంటున్నారంటే.. ఇరాన్ గవర్నమెంట్ లోనే క్లారిటీ లేదు, వాళ్లు వాళ్లే కొట్టుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఇరాన్ లోపల జరుగుతున్న ఈ అంతర్గత యుద్ధమే ఇప్పుడు చర్చలకు అడ్డంకిగా మారింది.
మొత్తం సీన్ లోకి పాకిస్థాన్ ఎలా వచ్చింది? అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. నిజానికి ట్రంప్ కాల్పుల విరమణ పొడిగించే మూడ్ లో లేరు. బాంబులు వేయడానికి ఆర్డర్స్ కూడా రెడీ చేసుకున్నారు. కానీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. ట్రంప్‌తో మాట్లాడారు.
సార్.. ఇరాన్‌కు ఇంకొక్క ఛాన్స్ ఇవ్వండి, వాళ్లు చర్చలకు వచ్చేలా మేము చూస్తాం అని రిక్వెస్ట్ చేశారట. వాళ్ల మాట విని ట్రంప్ ఆగారు. ఇది ట్రంప్ మార్క్ రాజకీయం! పాకిస్థాన్‌ను మధ్యలో పెట్టి ఇరాన్‌ను ఇరకాటంలో పడేశారు. కానీ, ట్రంప్ ఊరికే గ్యాప్ ఇవ్వలేదు.. చర్చలు జరిగే వరకు ఇరాన్ పోర్టుల మీద ఆంక్షలు ఉంటాయి, ఒక్క చుక్క ఆయిల్ కూడా బయటకు వెళ్లనివ్వనని కండిషన్ పెట్టారు. అంటే, గొంతు దగ్గర కత్తి పెట్టి శాంతి చర్చలు జరుపుతున్నారు ట్రంప్.
ఒకవేళ ట్రంప్ చెప్పినట్టు శుక్రవారం నాటికి ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే.. అది ప్రపంచానికే పెద్ద ఊరట. ఎందుకంటే అమెరికా-ఇరాన్ యుద్ధం జరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతాయి. సామాన్యుడి బతుకు భారమైపోతుంది. అందుకే గ్లోబల్ షేర్ మార్కెట్లు కూడా ఈ చర్చల వార్తలతో గ్రీన్ లోకి వచ్చాయి. కానీ, ఒకవేళ ఇరాన్ మొండిగా ఉండి చర్చలకు రాకపోతే మాత్రం.. శనివారం నుంచి బాంబుల వర్షం కురవడం ఖాయం. ట్రంప్ తన సైన్యానికి ఇప్పటికే రెడీగా ఉండండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంటే ఈ 48 గంటలు శాంతికి లేదా యుద్ధంకి మధ్య ఉన్న చిన్న గ్యాప్ అన్నమాట.
సో .. ట్రంప్ చెప్పినట్టు శుక్రవారం నిజంగానే గుడ్ న్యూస్ వస్తుందా? లేక ఇరాన్ అన్నట్టు ఇదంతా ట్రంప్ ఆడుతున్న మైండ్ గేమ్ నా? పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఇక్కడ పని చేస్తుందా లేదా? చూడాలి.
